Harish Rao: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నష్టం..! 1 y ago
టీజీ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను మరిచిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీళ్లను ఏపీ తీసుకెళుతున్నా నోరు మెదపడం లేదన్నారు. రైతుల పంటలను కాపాడటానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నీళ్ల తరలింపును నిలిపివేయాలన్నారు.
కృష్ణా జలాలు కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయాలన్నారు. ప్రభుత్వం చేసే పోరాటానికి తాము కూడా మద్దతిస్తామన్నారు. కాంగ్రెస్‌ని గెలిపించింది పంటలను ఎండబెట్టడానికా అని ప్రశ్నించారు. తక్షణమే సాగర్ కుడి కాలువకు నిటీ విడుదలను ఆపాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తున్నారని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు కాబట్టే ఆంధ్ర ప్రదేశ్ ఇష్టమొచ్చినట్లుగా నీటిని తరలిస్తోందన్నారు. ఉన్న నీటిని కాపాడుకోకపోతే ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో ఉన్న పంటలు దెబ్బతింటాయని చెప్పారు. ప్రజలు తాగేందుకు కూడా నీళ్లు లేని పరిస్థితి వస్తుందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.